Telangana Inter Results 2023: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు రేపు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మంగళవారం విడుదల చేయబోతున్నట్లుగా విద్యా శాక అధికారులు పేర్కొన్నారు. ఫలితాల విడుదల విషయమై నెలకొన్న సందిగ్దం నేపథ్యంలో అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫలితాల విడుదలకు సంబంధించిన సాప్ట్ వేర్ ను కూడా సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు. ఫలితాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండు సార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అధికారులకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రిజల్ట్ కోసం లక్షలాది మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు.
సాంకేతిక సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. విద్యార్థులు మంగళవారం వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో రిజల్ట్ ను చూసుకోవచ్చు. ఇంటర్ బోర్డ్ పరీక్ష పత్రాలను ఆన్ లైన్ ద్వారా మూల్యాంకనం చేయాలని మొదట భావించడం జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా చివరకు ఆఫ్ లైన్ లోనే మూల్యాంకనం చేయాల్సి వచ్చింది.
అందుకే చాలా సార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక సమస్యలు లేకుండా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రేపు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.06 లక్షల మంది విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరు అయ్యారు.
మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్ష పేపర్ లను ఏప్రిల్ రెండవ వారంలోనే మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 4,82,501 మంది మరియు సెకండర్ ఇయర్ పరీక్షలకు 4,23,901 మంది హాజరు అయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. గతంలో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు వేరు వేరుగా వచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సంవత్సరాల ఫలితాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Cyclone Mocha Latest News: మోచ తుఫాన్.. ఏ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం చూపనుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.