Telangana Schools Reopen: జనవరి 31 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేసే ఆలోచనలో కేసీఆర్ సర్కారు

Telangana Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ఈ నెల 30 వరకు మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 11:43 AM IST
    • విద్యాసంస్థలు రీఓపెన్ చేసే ఆలోచనలో తెలంగాణ సర్కారు
    • జనవరి 31 నుంచి పాఠశాలలకు తెరిచేందుకు సన్నాహాలు
    • ప్రత్యక్షంగా లేదా ఆన్ లైన్ క్లాసులకు అనుమతించేందుకు యోచన
Telangana Schools Reopen: జనవరి 31 నుంచి స్కూల్స్ రీఓపెన్ చేసే ఆలోచనలో కేసీఆర్ సర్కారు

Telangana Schools Reopen: సంక్రాంతి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులను తెలంగాణ సర్కారు పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 8 నుంచి ఆపై తరగతుల వారికి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. 

అయితే తెలంగాణలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని వైద్యారోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతుండడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించే యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు సమాచారం. 

కరోనా వ్యాప్తి రాష్ట్రంలో అదుపులో ఉందన్న వైద్యారోగ్య శాఖ అధికారులు నివేదికతో విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రత్యక్ష తరగతులను మొదలుపెట్టాలనే ఆలోచనతో వచ్చే సోమవారం (జనవరి 31) నుంచి మరో వారం రోజులు సెలవులు పొడిగిస్తారని సమాచారం.  

ఆ తర్వాత ప్రత్యక్ష తరగతులకు అనుమతివ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష తరగతులకు రావాలా? ఆన్‌లైన్‌ ఎంచుకోవాలా? అనేది తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే విషయమై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.  

Also Read: Corona in Telangana: రాష్ట్రంలో 4 వేల దిగువన కరోనా కొత్త కేసులు!

Also Read: Telangana Drugs Case : తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపుతామంటోన్న సీఎం కేసీఆర్‌‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News