హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ (#TSRTC) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించనుంది. తమ ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని గతేడాది దాదాపు రెండు నెలలపాటు కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఉద్యోగులు, కార్మికుల బదిలీలు, ఓడీ సహా ఇతరత్రా విషయాలపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!
ఉద్యోగులు, కార్మికుల శ్రమకు తగిన ఫలం దక్కుతుందన్నారు. ప్రస్తుతవ ఆర్టీసీకి ప్రతి నెల రూ.80 నుంచి రూ.90 కోట్ల మేర ఆదాయం ఆర్జిస్తుందని చెప్పారు. సమిష్టి కృషితో ఏదైనా సాధించవచ్చునని, ఇలాగే కొనసాగిస్తే.. డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కేఎంపీఎల్ అవార్ఢుల ప్రధానోత్సవంలో ఇంధనం ఎక్కువ పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లను సత్కరించారు.
Also Read: సినిమా షూటింగ్ కాదు.. బెజవాడలో పెళ్లిసందడి
ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, ప్రస్తుతం ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. కార్గో సర్వీసులను అంబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం కమిటీలు వేస్తామని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వివరించారు.