Telangana Rain Updates: తెలంగాణవ్యాప్తంగా గత 3 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో తెరిపినిచ్చిన వాన.. రాత్రికి మళ్లీ జోరందుకుంది. నిన్న రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే జలాశయాలకు భారీ వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులు గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ విభాగం 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరో 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని పేర్కొంది. శనివారం (జూలై 9) ఉదయం 8.30 గం. నుంచి ఆదివారం (జూలై 10) 7గం. వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 31 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.
Impact Based Forecast Heavy rainfall warning No.24 for the districts of Telangana and Hyderabad dated 10.07.2022 pic.twitter.com/iZ4yDBtUK4
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 10, 2022
Also Read: Telangana Floods: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు లక్షల క్యూసెక్కుల వరద.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook