Ponguleti Srinivas Reddy Serious On Congress High Command: తెలంగాణ లోక్ సభ ఎన్నికలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ నుంచి అనేక మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. బీఆర్ఎస్ కు ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు ప్రజాపాలన అందిస్తున్నారు. అధికారంలోకి రాగేనే అనేక శాఖాలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. అదే విధంగా గత బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేలా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా ఎంపీ అభ్యర్థుల సీట్ల టికెట్ ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ సీటు అనేది తెలంగాణలో హట్ టాపిక్ గా మారింది. ఇక్కడ తొలుత ఎంపీ టికెట్ ను పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా ఆతర్వాత దీనికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీని వెనుక ముఖ్యంగా ఇద్దరు మంత్రులున్నట్లు కూడా వార్తలు గుప్పుముంటున్నాయి. ముఖ్యంగా మంత్రులు.. మల్లు విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్ రావులు ఒక్కటై, పొంగులేటికి చెక్ పెట్టేవిధంగా పావులు కదిపినట్లు ప్రచారం జరుగుతుంది.
అంతే కాకుండా.. తొలుత ప్రసాద్ రెడ్డి పట్లు సుముఖంగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్, అనూహ్యంగా ఇలా మోండిచేయి చూపడంపై పొంగులేటీ సీరియస్ గా ఉన్నారంట. ఆయన కాంగ్రెస్ పెద్దల దగ్గర తన అసహానాన్ని కూడా చూపించారంట. మొదట ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి,ఇలా మాటతప్పడమేంటని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారంట.
Read More: Inter Results 2024: కవలల అరుదైన ఘనత.. 10 th, Inter లో సాధించిన మార్కులు తెలిస్తే షాక్ అవుతారు..
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఆధిపత్యపోరులో భాగంగా ఒక మంత్రిని చెక్ పెట్టేందుకు ఇలా చేసినట్లు కూడా రాజకీయాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ అనేక సందర్బాలలో సీఎం సీటుపై.. ఖమ్మం, నల్గొండ వాళ్లే కన్నేశారని, వాళ్లనుంచి సీటు కాపాడుకోవాలంటూ సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter