Telangana Police Recruitment Latest Update: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ తేదీలు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తేదీల వివరాలను వెల్లడించింది. నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ జనవరి 5వ తేదీన ముగుస్తుందని తెలిపింది. దేహాదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ ఎగ్జామ్స్‌కు అర్హత సాధిస్తారని పేర్కింది.
మార్చి 12వ తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు మెయిన్ ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9న సివిల్ ఎస్ఐ నియామకానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను https://www.tslprb.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
పేపర్-1 పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. పేపర్-2 పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌కు సంబంధించిన తేదీలను అధికారులు త్వరలోనే ప్రకటించనున్నారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్స్ పోస్టులకు ట్రేడ్/డ్రైవింగ్ టెస్ట్‌ల తేదీలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్ఐ పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పోస్టులకు మెుత్తం 6,61,198 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 6,03,955(91.34 శాతం) మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తోంది. ఫిజికల్ టెస్టుల్లో పాస్ అయిన వారు ఫైనల్ ఎగ్జామ్స్‌కు అర్హత సాధించనున్నారు.
Also Read: Team India: ఈ ఏడాది టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. ఆ సిరీస్ గెలిస్తే..
Also Read: Free Ration: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. మరో ఏడాది పొడగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి