హైదరాబాద్: దక్షిణ తెలంగాణకు సరిహద్దు జిల్లాలైన రాయిచూరు, యాద్గిర్‌జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభణతో తెలంగాణ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 51 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం 12 చెక్ పోస్టుల పునరుద్ధరణ చేపట్టింది. అత్యవసర వాహనాలకే అనుమతిస్థామని పేర్కొంది. నారాయణపేట జిల్లాలోని కృష్ణ మండలం గుడేబల్లూర్ టై రోడ్, చేగుంట, ఎస్కేపల్లీ, ఆలంపల్లి, మాగనూరు మండలంలోని ఉజ్జెల్లి, బైరంపల్లి, కొత్తపల్లి, మక్తల్ మండలంలోని పస్పుల, దత్తాత్రేయ టెంపుల్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Also Read: TTD lands issue : టీటీడీ వివాదంపై పాత ఆధారాలు బయటపెట్టిన బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
మరోవైపు నారాయణపేట జిల్లాలోని జలాల్‌పూర్, ఎక్లాస్‌పూర్, దామరగిద్ద మండలంలోని సజ్జనాపూర్, కానుకుర్తి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీస్, వైద్య సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలతో పాటు కాలినడకన వచ్చే వారిని సైతం నిలిపివేస్తున్నారు. దీంతో జలాల్‌పూర్, గుడేబల్లూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో నే అనుమతిస్తామని, అనవసరంగా ఎన్‌హెచ్-167 పైకి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..