One Card One State: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీపై మీనమేషాలు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతోంది. తాజాగా ఇప్పుడు సరికొత్త మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల స్థానంలో కుటుంబ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే కార్డులో కుటుంబ హెల్త్ ప్రొఫైల్ కూడా పొందుపరచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: HYDRAA Demolish: హైదరాబాద్‌ను కన్నీటిలో ముంచిన హైడ్రా కూల్చివేతలు
రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం వైద్యారోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Also Read: Cyber Crime: రీల్స్‌కు లైక్ కొడితే డబ్బే డబ్బు.. లక్షల్లో మోసపోయిన బాధితులు
రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు కింద ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 'వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డ్' విధానంతో ప్రభుత్వం ముందుకెళ్లాలనే యోచిస్తోంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించాలని సమావేశంలో చర్చించారు. ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలన్న సీఎం ఆదేశించారు. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
'ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్‌కు జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలి. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలి' అని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని వైద్యారోగ్య శాఖ కార్యక్రమాలపై సీఎం, మంత్రులు చర్చలు చేశారని సమాచారం. కాగా హెల్త్ కార్డు ప్రొఫైల్ కార్యక్రమం అనేది నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధ్యయనం చేయాలని నాడు అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని రేవంత్ సర్కార్ అమలు చేస్తుండడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.