Telangana: ఐసీయూలో రోగిని కొరికిన ఎలుక.. ఆస్పత్రిలో చోటు చేసుకున్న మరో షాకింగ్ పరిణామం..

Kamareddy: ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కొరికాయి. ఈ ఘటన తీవ్రసంచలంగా మారింది. బాధితుడి కుటుంబ సభ్యులు దీనిపై వైద్యశాఖకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఆస్పత్రిలో డాక్టర్లపై వ్యవహరంపై కూడా పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 11, 2024, 03:18 PM IST
  • - ఐసీయు వార్డులో షాకింగ్ పరిణామం..
    - ఆస్పత్రిలో రోగి చేతి వెళ్లను కొరికిన ఎలుక..
Telangana: ఐసీయూలో రోగిని కొరికిన ఎలుక.. ఆస్పత్రిలో చోటు చేసుకున్న మరో షాకింగ్ పరిణామం..

Rat Bites Patients Finger In ICU Ward: సాధారణంగా చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రులలో సౌకర్యాలు సక్రమంగా ఉండవని ఎప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పటికే  ప్రభుత్వ ఆస్పత్రులలో.. డాక్టర్లు కూడా సమయానికి డ్యూటీలకు రాకుండా, పార్ట్ టైమ్ ఇతర డ్యూటీలకు వెళ్తుంటారని బాధితులు ఆరోపిస్తుంటారు. ఇప్పటికే అనేక ఆస్పత్రులలో.. ఎలుకలు రోగులను కరిచిన ఘటన తీవ్రదుమారంగా మారిన విషయం తెలిసిందే.  

Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..

రోగులు తెచ్చుకున్న ఆహరాన్ని ఎలుకలు తింటుంటాయి. అదే విధంగా ఆస్పత్రులలో బాత్రూమ్ లలో కూడా దుర్గంధం ఉండటం వల్ల ఎలుకలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. తాజాగా, కామారెడ్డిలో  షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో ఉన్న రోగి చేతి వేళ్లు, కాళ్లను ఎలుకలు కొరికిన ఘటన తీవ్ర కలకలంగా మారింది.

కామారెడ్డిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన  షేక్ ముజీబ్ అనే వ్యక్తి సర్కారు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.  అతడిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం..రాత్రి ఎలుకలు, కాళ్లు, చేతి వేళ్లను కొరికి గాయపర్చాయి. ఉదయం గమనించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారం ఇచ్చారు. గాయపర్చిన చోట.. రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో రోగి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

ఆస్పత్రిని తనిఖీ చేసిన కమిషనర్..

కామారెడ్డి సర్కారు ఆస్పత్రిలో జరిగిన ఘటన వైరల్ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై విద్యావిధాన కమిషనర్ అజయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. పలు వార్డులను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా చూసుకొవాలన్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారి డాక్టర్లకు సూచించారు.ఘటనపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రజలకు కాపాడాల్సిన ఆస్పత్రులలో రోగుల ప్రాణాలకు భద్రత లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐసీయూలో ఇంత అస్తవ్యస్త పరిస్థితి ఉంటే , సిబ్బంది ఏంచేస్తున్నారని స్థానికులు అసహానం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకుని, పారిశుద్యం గురించి పట్టుకుని సిబ్బందిపై చర్యలు తీసుకొవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక రోగి, ఐసీయులో ఉండగా ఇలాంటి ఘటన జరగటం తీవ్ర బాధాకరమని కూడా చెబుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

 

Trending News