తెలంగాణ జైళ్ళ శాఖ విజయాలపై పుస్తకం

తెలంగాణ జైళ్ళ శాఖను దేశంలోనే ఉత్తమమైన జైళ్ళ శాఖగా పలు ప్రభుత్వాలు కూడా కొనియాడుతున్న సందర్భంలో.. ఆ శాఖ మళ్లీ వార్తల్లో నిలిచింది. 

Last Updated : Jan 9, 2018, 08:33 PM IST
 తెలంగాణ జైళ్ళ శాఖ విజయాలపై పుస్తకం

తెలంగాణ జైళ్ళ శాఖను దేశంలోనే ఉత్తమమైన జైళ్ళ శాఖగా పలు ప్రభుత్వాలు కూడా కొనియాడుతున్న సందర్భంలో.. ఆ శాఖ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆ జైళ్ళలో అధికారులు పాటించే మంచి పద్ధతులు, నియమాలతో కూడిన పుస్తకాన్ని బ్యూరో ఆఫ్ పోలీసు (ఆర్ అండ్ డీ) ప్రచురించే బాధ్యతను తీసుకుంది. "బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ ప్రిజన్స్ ఇన్ తెలంగాణ" పేరుతో త్వరలోనే ఓ బుక్‌లెట్ తీసుకొస్తున్నట్లు ఈ సందర్భంగా బ్యూరో తెలిపింది.

దేశంలోనే అత్యుత్తమైన జైళ్ళ శాఖగా తెలంగాణ జైళ్ళ శాఖ కితాబునందుకున్న సందర్భంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ శాఖ డైరెక్టర్ వినయ్ కుమార్ సింగ్ ప్రెస్ మీట్‌లో తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బిచ్చగాళ్ళ సంఖ్యను తగ్గించడానికి శాఖ ప్రయత్నించిందని.. బిచ్చమెత్తుకుంటున్న దాదాపు 1000 మంది  పురుషులకు, 450 మంది స్త్రీలకు కౌన్సిలింగ్ కూడా తాము ఇచ్చామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం నేరాల సంఖ్య కూడా బాగా తగ్గిందని ఆయన తెలిపారు. అలాగే జైళ్ళలో నిరక్షరాస్యులైన ఖైదీలకు విద్యను బోధించే పథకానికి కూడా తాము శ్రీకారం చుట్టామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Trending News