Girl Cracks Five Govt JObs: పాంచ్ పటాకా.. యువతికి ఒకేసారి ఐదు సర్కారు కొలువులు.. ఎందులో చేరిందంటే..?

Government Jobs: జగిత్యాల జిల్లాకు చెందిన ఒక యువతి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ల్యాగలమర్రి గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పుప్పాల మమతా సర్కారు  కొలువు కోసం ఎంతో కష్టపడేది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రొత్సహించేవారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 3, 2024, 11:41 AM IST
  • ఎన్నో ఏళ్లుగా పడిన కష్టానికి దొరికిన ఫలితం..
  • ఒకేసారి ఐదు జాబ్ లు సాధించి శభాష్ అన్పించుకున్నయువతి..
Girl Cracks Five Govt JObs: పాంచ్ పటాకా.. యువతికి ఒకేసారి ఐదు సర్కారు కొలువులు.. ఎందులో చేరిందంటే..?

Jagtial Girl Bags Five Jobs: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎందరో యువత కలలు కంటునే ఉంటారు. దీని కోసం కొందరు డిగ్రీలు కాగానే తమ ప్రిపరేషన్ ను స్టార్ట్ చేస్తుంటారు. డిస్టెన్స్ లో పీజీలు చేస్తారు. సొంతంగా నోట్స్ లు ప్రిపేర్ చేసుకుంటారు. కొందరు యూట్యూబ్ లలో పాఠాలు కూడా వినితమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తాము అనుకున్నది సాధించే వారకు కూడా ఎలాంటి వేరే డివీయేషన్స్ లేకుండా కష్టపడుతుంటారు. కొందరు కోచింగ్ సెంటర్ లలో చేరి, క్లాసులలో చెప్పిన పాఠాలు విని, ప్రత్యేకంగా ప్రిపరేషన్ చేసుకుంటారు.

Read More: Honey Rose: రోజా పువ్వుల మెరిసిపోయిన హనీ రోజ్.. ఫోటోలు చూస్తే ఫిదా

ముఖ్యంగా యువత ఎక్కువగా బ్యాంకింగ్ గ్రూప్ 1, 2, సివిల్స్ ఎగ్జామ్ ల కోసం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. మరికొందరు ఉపాధ్యాయ రంగంలో సెటిల్ కావాలని కలలు కంటారు. దీని జెల్, డీఎల్ ఎగ్జామ్స్ లకు ప్రిపేర్ అవుతుంటారు. ఇలా ఒక టార్గెట్ పెట్టుకున్న వారిలో  కొందరు మాత్రమే చివరి వరకు వెళ్లి, విజయం సాధిస్తారు.

కొందరు మాత్రం.. ఆరంభంలో టాలెంట్ చూపించన కూడా కొన్ని పర్సనల్ కారణాలతో ఉద్యోగం సాధించడంలో విఫలమౌతారు.సర్కారు కొలువులకు సిద్ధమయ్యే వారు.. ముఖ్యంగా తమ టార్గెట్ పట్ల అంకిత భావం ఉండాలి. అంతే కాకుండా దాదాపు.. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. అందుకే ప్రిపరేషన్ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే, ఒక జాబ్ కాదు. ఒకేసారి నాలుగైదు జాబ్ లో కూడా క్రాక్ చేయోచ్చు. అచ్చం ఇలాంటి స్పూర్తిదాయకమైన స్టోరీ ప్రస్తుతం వార్తలలో  నిలిచింది.

పూర్తి వివరాలు..

తెలంగాణ లోని జగిత్యాలకు చెందిన పుప్పాల మమతా ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. సదరు యువతి.. బీఈడీ, ఎంకాం పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే టార్గెట్ గా.. సిరిసిల్లలోని గురుకుల డిగ్రీకాలేజ్ లో కాంట్రాక్టు లెక్చరర్ గా పనిచేసింది. ఇటీవల.. గురుకుల ఎగ్జామ్స్ లలో స్టేట్ లో 16 వ  ర్యాంకు, జేఎల్, సోషల్ విభాగంలో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలను సాధించింది.

ఇవేకాకుండా.. టీఎస్ పీఎస్సీ మున్సిపల్ శాఖలో భర్తీలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జాబ్, కూడా సాధించింది. కామర్స్ లో తనకున్న టాలెంట్ వల్లనే ఈ ఉద్యోగాలు వచ్చాయని మమతా చెప్పింది. తాను డిగ్రీ పోస్టులో చేరి స్టూడెంట్స్ కు సేవలు అందిస్తానని చెప్పింది.

Read More: Jaggery Tea: బెల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మహిళలు కచ్చితంగా ఇదే తీసుకుంటారు!

యువతి తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమ దంపతులు తమ కూతురు సాధించిన విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ రాత్రనక, పగలనక కష్టపడి చదివేదని, దీనికోసం ఎన్నో త్యాగాలు చేసిందని కూడా చెప్పారు. చివరకు తమ బిడ్డకోరుకున్న కొలువు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మమతా తల్లిదండ్రులు అన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

 

 

Trending News