Gandhi hospital: డాక్టర్లపై దాడి ఘటన.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్లపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం ఏంటంటూ వైద్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు.  రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటనతో గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Last Updated : Apr 1, 2020, 10:12 PM IST
Gandhi hospital: డాక్టర్లపై దాడి ఘటన.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి

హైదరాబాద్ : గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్లపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం ఏంటంటూ వైద్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేశారు.  రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటనతో గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. క్లిష్టమైన సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చర్యలను ప్రభుత్వం క్షమించదని... దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలుపణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే వారిని కొట్టడం ఎంత వరకు సబబు అని దాడి చేసిన వారిపై మంత్రి మండిపడ్డారు. Read also : Coronavirus రోగులకు రోబోలతో ఆహారం, మెడిసిన్ సరఫరా

డాక్టర్స్ మీద దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి కష్టమైన సమయంలో ఇలాంటి ఘటనలు ఎవ్వరికీ మంచిది కాదు. డాక్టర్లు ప్రజల కోసం 24 గంటలు పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రతీ డాక్టర్‌కి రక్షణ కల్పిస్తాం. భరోసాతో పని చేయండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఈ సందర్భంగా వైద్యులకు మంత్రి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News