'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో ఉండే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన అధునాతన టెక్నాలజీని హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
తొలిసారిగా కరోనా వైరస్ సహా ఇతర సూక్ష్మ క్రిములను ఎదుర్కునేందుకు 3వీ సేఫ్ టన్నెల్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక వైపు నుంచి మరో వైపుకు వెళ్తే శరీరంపై ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి. 1.5 మైక్రాన్‌ల నుంచి 20 మైక్రాన్‌ల పరిమాణంలో ఉండే సూక్ష్మ క్రిములను ఇది నాశనం చేస్తుంది.
గ్రిడ్ వైఫల్యంలో అర్ధం లేదు..!!
డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర అధికారులు దీన్ని పరీక్షించి చూశారు. ఈ టన్నెల్‌లో 20 సెకండ్లపాటు వెళ్తే చాలు. 3వీ సేఫ్ టన్నెల్ పరికరాన్ని వాస్కులర్ టెక్నాలజీ అనే సంస్థ తయారు చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
హైదరాబాద్‌లో 3వీ సేఫ్ టన్నెల్