Telangana Film chamber: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఇటివలే ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం హైదరాబాద్ లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ (TFCC) ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పిలిచిన వెంటనే ఎన్నో పనులు విడిచిపెట్టుకొని వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చామన్నారు. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం అద్దె తీసుకుని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ కు సొంతంగా ఫిలింనగర్ లో 800 గజాల స్థలం ఇప్పించగలరని కోరుతున్నాం. ఆ స్థలంలో సొంత కార్యాలయం నిర్మించుకుంటామన్నారు.
నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 యేళ్లు అవుతోంది. 40 సినిమాల వరకు నిర్మాతగా చిత్రాలు నిర్మించాను. ఎనిమిది సినిమాలను డైరెక్ట్ చేసామన్నారు. అలాగే 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయాన్ని ప్రస్తావించాను. ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి మా చాంబర్లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నాను. మా తెలంగాణలో ఉండే కొందరు బడా నిర్మాతలు మంత్రి పి ఏ లకు ఫోన్ చేసి మంత్రి ఫంక్షన్ కు రాకుండా చేసారన్నారు.ఈ సందర్భంగా మా విన్నపాలను సావకాశంగా విని నెరవేరుస్తామని హామి ఇచ్చారు.
పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. కానీ చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ హైక్ అవసరం లేదు. థియేటర్స్ లో చిన్న సినిమా రిలీజ్ కు క్యూబ్, యూఎఫ్ వో వంటి కంటెంట్ ప్రొవైడర్స్ కు తమిళనాట 2500 ఉంటే మన దగ్గర 10 వేలు వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు మద్ధతుగా ఉన్నారు. నేను గతంలో నిరాహార దీక్ష చేస్తే 3 వేల వరకు ఈ ఛార్జీలు తగ్గించారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. మా సభ్యుల్లో కొంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని కోరుతున్నామన్నారు.
ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికైన సభ్యులకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చుకుంటోంది. సొసైటీకి మంచి ఆలోచనలు చెప్పేందుకు సినిమాను మించిన గొప్ప మాధ్యమం లేదన్నారు.
సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఆరోసారి ఛైర్మన్ గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్ కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్ ద్వారా వారు ఎంతో మందికి సపోర్ట్ అందిస్తున్నారు. నాకు సినిమాలంటే ఇష్టమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున తెలంగాణ సినీ కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తామన్నారు. మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తరుపున గానీ, వ్యక్తిగతంగా నా తరుపున గానీ చేస్తానని హామీ ఇస్తున్నా అన్నారు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter