TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం ఫలితాల్ని రిలీజ్ చేయనున్నారు.
తెలంగాణ ఇంజీనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు రేపు అంటే శుక్రవారం ఆగస్టు 12న విడుదల కానున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ ప్రాంగణంలో జరిగిన ఎంసెట్ కమిటీ ఈ విషయాల్ని వెల్లడించింది. తెలంగాణలో జూలై 18 నుంచి 21 వరకూ జరిగిన తెలంగాణ ఎంసెట్ 2022 ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షకు 1.56 లక్షల మంది హాజరు కాగా. జూలై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షకు 80 వేలమంది హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఎంసెట్ 2022 ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11.15 నిమిషాలకు ముందుగా తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల కానుండగా..11.45 నిమిషాలకు ఎంసెట్ ఫలితాలు విడుదలౌతున్నాయి. విద్యార్ధులు తమ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in/ లో చెక్ చేసుకోవచ్చు.
Also read: Telangana BJP: కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి బ్రేక్.. బీజేపీకి ఎన్నికల సంఘం షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook