Telangana Eamcet-2022: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి జరిగే ఈ-సెట్ పరీక్ష వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 14 నుంచి జరిగే ఎంసెట్ పరీక్ష యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారిక ప్రకటన చేసింది. భారీ వర్షాల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబ్రాది తెలిపారు.
త్వరలోనే పరీక్ష నిర్వహించే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 14 వరకు ఇలాంటి వాతావరణ ఉండే అవకాశం ఉంది. మరో రెండురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో పరీక్షలు సైతం రద్దు అయ్యాయి.
Also read:PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!
Also read:CM Jagan Review: నాణ్యత విషయంలో రాజీ పడం.. ఇళ్ల నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook