COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు చేయగా అందులో 3,660 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో యధావిధిగానే జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే అత్యధికంగా 574 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి.
అలాగే గత 24 గంటల్లో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా మరో 23 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,060 మంది కరోనా కారణంగా కన్నుమూసినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ స్పష్టంచేసింది.
Also read : COVID-19, Black fungus కి ఉచిత వైద్యం అందించిన తొలి రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
ఇప్పటివరకు తెలంగాణలో 4,95,446 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీళ్లలో తీవ్ర లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తుండగా తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి ఇళ్ల వద్దే ఉండి ఐసోలేట్ కావాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు (Black fungus cases) వెలుగుచూస్తుండటంతో కరోనా తరహాలోనే బ్లాక్ ఫంగస్‌ని సైతం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అక్కడక్కడ బ్లాక్ ఫంగస్‌తో చనిపోతున్న వారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కూడా బ్లాక్ ఫంగస్‌పై యుద్ధం మొదలుపెట్టింది.
Also read : Black Fungus: బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌పై Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇప్పటికే దేశంలో కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు హడలెత్తిస్తుండగా కొత్తగా వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. తొలిసారిగా బీహార్ లోని పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు (White fungus symptoms) నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook