Covid-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం అంతకుముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,696 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో కొత్తగా 2,384 మందికి కరోనా వైరస్ (Covid-19) సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 5,83,228 కి చేరింది. అదే సమయంలో మరో 17 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,313 కి చేరింది.
తెలంగాణలో గత 24 గంటల్లో 2,242 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోరుకున్న వారి మొత్తం సంఖ్య 5,46,536 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also read: Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్డేట్స్
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో అక్కడక్కడా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది (Black fungus cases). కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రికి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటమే అందుకు నిదర్శనం. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు (Treatment for black fungus) ఈఎన్టీ హాస్పిటల్ నోడల్ కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే.
Also read : Etela Rajender: ఈటల రాజేందర్ చేరికపై BJP MLA Raja Singh ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook