టి సర్కార్‌, ఆర్టీసీ యాజమాన్యంపై కేంద్ర మంత్రికి తెలంగాణ బీజేపి ఎంపీల ఫిర్యాదు

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను, సమ్మె అనంతరం జరుగుతున్న పరిణామాలు, కార్మికుల డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు... కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

Last Updated : Nov 22, 2019, 05:35 PM IST
టి సర్కార్‌, ఆర్టీసీ యాజమాన్యంపై కేంద్ర మంత్రికి తెలంగాణ బీజేపి ఎంపీల ఫిర్యాదు

న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌తో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు భేటీ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను, సమ్మె అనంతరం జరుగుతున్న పరిణామాలు, కార్మికుల డిమాండ్లను కేంద్ర మంత్రికి వివరించిన ఎంపీలు... కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు. ఆగస్ట్ 2019 గాను కార్మికులకు ఆర్టీసీ రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించమని ఈపీఓ నుంచి డిమాండ్ నోటీస్ వచ్చిందని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

మొత్తం పీఎఫ్‌కు సంబంధించిన రూ.760 కోట్లు బకాయిలు చెల్లించడం లేదని వివరించిన ఎంపీలు.. ఇప్పటికే 49,000 మంది ఉద్యోగులు సమ్మె చేసినా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి స్పందించలేదని ఫిర్యాదు చేశారు. పీఎఫ్ బకాయిలు చెల్లించంచక పోవడం ఈపీఎఫ్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యగా భావించి వెంటనే కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Trending News