Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనితీరుపై తన దాడి కొనసాగిస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మరోసారి లేఖ రాశారు. 3 పేజీల బహిరంగ లేఖలో రైతులకు సంబంధించిన పలు అంశాలను ప్రశ్నిస్తూ.. సీఎం కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేసీఆర్ ను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు.
8 ఏళ్ల కేసీఆర్ పాలనంతా రైతుల కంట కన్నీరు కేసీఆర్ ఫామ్‌హౌస్ పంట పన్నీరుగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రంపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనా గోబల్స్ ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని కేసీఆర్‌కు సూచించారు. వరి సహా 14 పంటలకు కనీస మద్ధతు ధరను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. మోడీని ఆదర్శంగా తీసుకుని రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాలని కేసీఆర్ కు సూచించారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఏడు వేల 5 వందల కోట్ల రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలన్నారు బండి సంజయ్. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయని.. ఏరువాక పనులు మొదలయ్యాయని చెప్పారు. ఆ సమయంవో పెట్టుబడి సాయం అందిస్తేనే రైతులకు ఆసరాగా ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనకు కోట్ల నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతు బంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు బండి సంజయ్. రైతుబంధు పథకం నిధులు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర రైతులు అప్పులు తీసుకుంటున్నారని అన్నారు. దీంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న రైతు బంధుకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు.పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణలో 5800 కోట్ల రూపాయల నిధులను జమచేసి రైతులను ఆదుకుందని చెప్పారు. ఈ సీజన్ కోసం 580 కోట్ల రూపాయలను మే 31నే కేంద్రం జమ చేసిందని గుర్తు చేశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ పథకం ఫలితాలు రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించాలని బండి సంజయ్ సూచించారు.
READ ALSO: Lokesh Zoom Meeting: లోకేష్ జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏపీలో సంచలనం..
READ ALSO: China Plane Crash: చైనాలో కుప్పకూలిన మరో విమానం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook