Munugodu Bypoll: మునుగోడు టు ఏపీ బీజేపీ, కొత్త పొత్తు టీడీపీకు వర్కవుట్ అవుతుందా

Munugodu Bypoll: మునుగోడు ఉపఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీయనున్నాయా అనే చర్చ ప్రారంభమైంది. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకు మద్దతివ్వడం వెనుక టీడీపీ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2022, 03:51 PM IST
Munugodu Bypoll: మునుగోడు టు ఏపీ బీజేపీ, కొత్త పొత్తు టీడీపీకు వర్కవుట్ అవుతుందా

తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నిక ప్రభావం కొత్త రాజకీయ సమీకరణాలు, పొత్తులకు దారీ తీయనుందా అనే చర్చ ప్రారంభమైంది. బీజేపీకు తెలుగుదేశం పార్టీ మద్దతు వెనుక లాజిక్ ఇదేననే సందేహాలు వస్తున్నాయి. మునుగోడుకు, ఏపీ రాజకీయాలకు సంబంధమేంటో తెలుసుకుందాం..

మునుగోడు ఉపఎన్నిక సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. నియోజకవర్గంలో ఆధిక్యమున్న బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. మరోవైపు వివిధ పార్టీల్లో గోడదూకుడు వ్యవహారాలు పెరిగిపోయాయి. అదే సమయంలో కొత్త పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. కొత్త పొత్తుల వెనుక కారణాలేంటి, నియోజకవర్గానికే పరిమితమౌతుందా..ఇతర ప్రయోజనాలున్నాయా అనేది చర్చనీయాంశమౌతోంది. 

మునుగోడులో టీడీపీ-బీజేపీ కొత్త పొత్తు

మునుగోడు ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. పార్టీ అభ్యర్ధిని బరిలో దింపాలనే ఆలోచనను విరమించుకుంది.  అదే సమయంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతివ్వాలని నిర్ణయించింది. అటు కోమటిరెడ్డి కూడా తనకు మద్దతివ్వాలని తెలంగాణ టీడీపీ నేతల్ని కోరడం వెనుక మతలబు ఉందని తెలుస్తోంది. 

చంద్రబాబు నిర్ణయం వర్కవుట్ అయ్యేనా

మునుగోడులో జరుగుతున్న తాజా పరిణామాలు ఏపీ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపించవచ్చని తెలుస్తోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టడంతో అది సాధ్యం కావడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీలో ఓ వర్గం అనుకూలంగా ఉన్నా..అసలు అగ్రనేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

ఇప్పుడు మునుగోడులో బీజేపీకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆ పార్టీకు చేరువ కావాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ సహకారం పొందాలంటే..మునుగోడులో బీజేపీకు సహకరించాలనేది చంద్రబాబు ఆలోచన. ఏపీ బీజేపీవైపుకు మునుగోడు ఉపఎన్నిక దారి తీస్తుందనే ఆలోచనలో చంద్రబాబు అండ్ కో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తు ఆలోచన ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందనేది మున్ముందు తేలనుంది.

బీసీలను ఆకర్షించే ప్రయత్నాలు

మునుగోడు నియోజకవర్గంలో విజయాన్ని నిర్ణయించే బీసీ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఏ ఒక్కటీ బీసీ సామాజిక అభ్యర్ధికి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ల కోసం ఆ సామాజికవర్గ నేతల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీకు మాజీ ఎంపీ బూర నర్శయ్య గౌడ్ రాజీనామా చేయడంతో బీసీ, గౌడ సామాజికవర్గం కోసం కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్‌ను టీఆర్ఎస్ చేర్చుకుంది. 

Also read: Harish Rao On Munugode: మునుగోడు ఓటర్లు బీజేపీని బొంద పెడ్తరు.. 3 వేల పెన్షన్ పై మోడీ ప్రకటన చేయాలన్న హరీష్ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News