Khammam floods: ఖమ్మంలో హైటెన్షన్...హరీష్ రావు కారుపై రాళ్లదాడి... వీడియో వైరల్..

khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 3, 2024, 04:14 PM IST
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు..
  • సహాయక చర్యల్లో షాకింగ్ ఘటన..
Khammam floods: ఖమ్మంలో హైటెన్షన్...హరీష్ రావు కారుపై రాళ్లదాడి... వీడియో వైరల్..

Stone attack on harish rao car in khammam: తెలంగాణలో భారీ వర్షాల వల్ల వరదలు పొటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం వరద వల్ల ఎక్కువగా నష్టపోయిందని తెలుస్తోంది. ఖమ్మం పూర్తిగా వరద నీటితో అష్టదిగ్భందంలా మారిపోయింది. ఖమ్మంలో ఎటు చూసిన వదర పొటెత్తింది. అంతేకాకుండా..అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రాంతంలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు, సీఎం లు ఏదో ఫోటోలకు ఫోజు లిచ్చుకుంటూ తిరుగుతున్నారని కూడా స్థానికులు మండిపడుతున్నారు.

 

తమకు ఎలాంటి సహాయం కూడా కాంగ్రెస్ సర్కారు నుంచి అందలేదని బాధితులు గగ్గొలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఖమ్మం వదర ప్రభావిత ప్రాంతాలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు.. హరీష్ రావు, పువ్వాడ, సబితా ఇంద్ర రెడ్డి బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లారు. వరదలో ఉన్నవారికి తామున్నామని భరోసా ఇచ్చేందుకు వెళ్లారు అక్కడి వారితో హరీష్ రావు మాట్లాడి, వారి బాధలను విన్నారు. అంతేకాకుండా..  వరద సంభవించిన ప్రాంతాలలో పలు ఏరియాలను స్వయంగా వెళ్లి చూశారు. బాధితులకు కడుపు నిండా అన్నం, కట్టుకొవడానికి బట్టలు కూడా లేవని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నేతలు తమ వంతుగా వరద సంభవించిన ప్రాంతంలో నిత్యవసరాలు పంపిణి కార్యక్రమం చేపట్టారు. దీంతో చాలా మంది అక్కడికి చేరుకుని.. నిత్యవసరాల వస్తువులు తీసుకుంటున్నారు.ఇంతలో కొంత మంది  ఆగంతకులు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ పైన రాళ్లదాడికి పాల్పడ్డారు.

Read more: king cobra: బాప్ రే..  ఇంట్లో 11 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వణికిపోయిన స్నేక్ రెస్క్యూ టీమ్.. షాకింగ్ వీడియో వైరల్..  

దీంతో అక్కడ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వాగ్వాదం చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారుల్ని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్య సరుకులు నిత్యవసర సరుకులు పంచుతుంటే జీర్ణించుకోలేక బిఆర్ఎస్ పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీ వారు.. గొడవకు దిగారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ దాడికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News