ఇకపై తెలంగాణలో మోడల్ మార్కెట్లు: సబితా ఇంద్రారెడ్డి

రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో  సమీకృత మోడల్ మార్కెట్  నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 

Last Updated : Feb 21, 2020, 08:09 AM IST
ఇకపై తెలంగాణలో మోడల్ మార్కెట్లు: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో  సమీకృత మోడల్ మార్కెట్  నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి అమలు  సన్నాహక సమావేశం నేడు శంషాబాద్ లో నేడు మధ్యాహ్నం జరిగింది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్,  కాలే యాదయ్య,  జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,  జిల్లా లోని మున్సిపల్ మేయర్లు,  ఉప మేయర్లు,  చైర్మన్,  వైస్ చైర్మన్ లు,  కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..  ప్రతీ నగరంలో నాణ్యమైన,  పరిశుభ్రమైన కూరగాయలు,  పండ్లు,  నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ప్రాంతంలో అందించేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ల నిర్మాణానికి ప్రతీ మున్సిపల్ కేంద్రంలో ఒక ఎకరం స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

 రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు ప్రతీ నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, దీనివల్ల మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణానికి ప్రధానంగా షీ-టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యత నివ్వాలని స్పష్టం చేశారు.

ఈనెల 24వ తేదీ నుండి  మార్చ్4వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వార్డుల వారీగా  యువకులు, మహిళలు విద్యావంతులు, సీనియర్  సిటిజన్లు 60 మందితో కమిటీలు వేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని దీనిలో భాగంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు 130 కోట్ల రూపాయల నిధులు వస్తాయని వెల్లడించారు. తమ బడ్జెట్లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించాలని స్పష్టం చేశారు. రానున్న రెండు నెలల్లో ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని కోరారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలసత్వం వహించే చైర్మన్లు, కౌన్సిలర్లను తొలగించే అవకాశం  కలెక్టర్లకు కల్పిస్తూ నూతన మున్సిపల్ చట్టంలో మార్పులు తెచ్చిన  విషయాన్ని గుర్తు చేశారు. వార్డుల వారీగా స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ పై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రధానంగా తడి పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు స్థానికులకు చైతన్యపరిచే బాధ్యత ప్రజా ప్రతినిదలదే అన్నారు. ప్రతి మున్సిపాలిటీలలో ఆట స్థలం ఏర్పాటు చేయాలని, చెరువులు, కుంటలను సుందరమైన పార్కుల మాదిరిగా తీర్చి దిద్దాలని, తమ పరిధిలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News