Corona Third wave: 'మూడో దశ ఎదుర్కొనేందుకు రెడీ- ఈ సారి లాక్​డౌన్​లు ఉండవు'

Corona Third wave: కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలంగాణ ప్రజా ఆరోగ్య విభాగ డైరెక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 04:47 PM IST
  • కొవిడ్ థార్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధం..
  • తెలంగాణ ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్​ వెల్లడి
  • ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన
Corona Third wave: 'మూడో దశ ఎదుర్కొనేందుకు రెడీ- ఈ సారి లాక్​డౌన్​లు ఉండవు'

Corona Third wave: దేశంలో కరోనా 'ఒమిక్రాన్ వేరియంట్​' భయాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజా ఆరోగ్య విభాగ డైరెక్టర్​ డాక్టర్ శ్రీనివాస రావు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో కేసులు దాస్తున్నట్లు(Corona cases in Telangana) వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది భారీగా కేసులు..

రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 15 తర్వాత కేసులు పెరగొచ్చని.. ఆ తర్వాత ఫిబ్రవరిలో తీవ్రత మరింత పెరగొచ్చని (Corona third wave in India) తెలిపారు శ్రీనివాస రావు. త్వరలో పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలను (Covid rules in Telangana) సూచించారు.

లాక్​డౌన్ ఉండదు..!

అయితే ప్రజలు ఆందోలన పడాల్సిన అవసరం లేదని చెప్పారు శ్రీనివాసరావు. కొవిడ్ మూడో వేవ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కరోనా కన్నా తప్పుడు వార్తల వల్లే (Fake news on Corona) భయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. అయితే రానున్న రోజుల్లో లాక్​డౌన్ వంటి ఆంక్షలు ఉండబోదని వివరించారు.

ఈ నెలాఖరుకు 100 శాతం వ్యాక్సినేషన్..

దేశంలో ఒమిక్రాన్​ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగం పెంచినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92 శాతం మంది మొదటి డోసు.. 48 శాతం రెండు డోసుల టీకా తీసుకున్నారని చెప్పారు.

అక్కడ 75 శాతం ఒమిక్రాన్ కేసులే..

ఒమిక్రాన్ మొదటగా బయటపడిన దక్షిణాఫ్రికాలో కేసులు భారీగా పెరుగుతున్నట్లు తెలిపారు శ్రీనివాస్​ రావు. అక్కడ నమోదవుతున్న కొత్త కేసుల్లో 75 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని (Omicron cases in South Africa) తెలిపారు. అయితే కేసులు పెరిగినా.. మరణాలు మాత్రం పెరగటం లేదని వివరించారు. మన దేశంలో ఇప్పటి వరకు 5 ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు స్పష్టం చేశారు.

Also read: Konijeti Rosaiah: ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు పూర్తి

Also read: KTR: ఆ విషయంలో సాయం చేయాలని-మంత్రి కేటీఆర్‌కు కందికొండ కుమార్తె విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News