Police Arrests తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో ఆ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ఏడుగురి అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి,దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని కోడి పందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 04:20 PM IST
  • కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు
  • పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
  • బైక్స్,కోళ్లు,నగదు స్వాధీనం
  • కేసులు నమోదు చేసి రిమాండుకు తరలింపు
Police Arrests తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో ఆ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ఏడుగురి అరెస్ట్

Police Arrests Seven after Raids on Cockfight: తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. ముల్కలపల్లి,vదాని చుట్టు పక్కల ప్రాంతాల్లోని కోడి పందాల స్థావరాలపై తాజాగా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్నవారితో పాటు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 46 బైక్స్, 15 కోళ్లు,రూ.14970 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముల్కలపల్లి, అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పాల్వంచ సబ్ డివిజన్ ఇన్‌చార్జి రోహిత్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరు పరారీలో ఉన్నారని... వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Also Read: SURIYA JAI BHIM: హీరో సూర్యపై BJP నేత సంచలన వ్యాఖ్యలు.. సూర్య రియాక్షన్ అదుర్స్

ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన మరో ఘటనలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి నుంచి రూ.7లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News