నిజామాబాద్ సభలో ప్రధాని మోడీ మైనార్టీల అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై విరమ్శలు సంధించారు. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ అనురిస్తున్న విధానాన్నే కేసీఆర్ అనుసరిస్తున్నారని ఆరోపించారు. తమ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజీయాలకు దూరం ఉంటుందని.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతోనే బీజేపీ ముందుకు వెళ్లుందని ప్రధాని మోడీ వివరించారు. కాంగ్రెస్,టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణలో సబ్ కా వికాస్ జరగదని విమర్శించారు. అభివద్దిపై విశ్వాసం ఉంచే వారు.. నవ తెలంగాణ కోరుకునే ప్రజలు బీజేపీతో వెంట ఉంటారని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే తెలంగాణలో అమలు అవుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ మరో అడుగు ముందుకు వేసి ముస్లింమైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ..కాంగ్రెస్, టీఆర్ఎస్ విధానంపై విమర్శలు సంధించారు. హిందు ఓట్లను కొల్లగొట్టేందుకే ప్రధాని మోడీ ఇలాంటి వ్యాఖ్యాలు చేశారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ సభలో మైనార్టీల అంశాన్ని ప్రస్తావించిన మోడీ