Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

NIRDPR Recruitment 2020: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

Last Updated : Dec 10, 2020, 12:43 PM IST
  • కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
  • 510 జాబ్స్‌కు నోటిఫికేషన్ జారీ
  • డిసెంబర్ 29న తుదిగడువు పూర్తి
Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టుల (NIRDPR Jobs 2020)ను బట్టి ఉద్యోగాలకు అర్హత, వయసు నిర్ధారించారు.

దేశ‌ వ్యాప్తంగా క్లస్టర్ మోడ‌ల్ గ్రామ‌ పంచాయ‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ హైదరాబాద్‌లోని ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది. ప్రస్తుతానికి ఏడాది కాలపరిమితితో ఉద్యోగాలు చేస్తున్నారు. పనితీరు, అవసరాన్ని బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూసుకోవాల్సి ఉంటుంది.
Also Read : Boy Flying in The air with a Kite: గాలిపటంతో 30 అడుగుల వరకు ఎగిరిన బాలుడు.. ఆ తర్వాత ఏమైంది! 

మొత్తం పోస్టులు - 510
క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250
యంగ్ ఫెలోస్- 250
స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్- 10
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 29
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి

స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌కు నెల‌కు రూ.55 వేలు వేతనం ఉంటుంది. యంగ్ ఫెలో పోస్టులకు నెల‌కు రూ.35 వేలు అందుకుంటారు. క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ నెల‌కు రూ.12,500 జీతం.  NIRDPR Recruitment 2020 నోటిఫికేషన్‌ పూర్తి వివరాలను http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Also Read: ​WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News