Governor Tamilsai: తెలంగాణ గవర్నర్‌ను అనకూడని మాటన్న నెటిజన్!

Netizens trolls Telangana Governor Tamilisai. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై విషయం చల్లారక ముందే సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. ఇందులోనే భాగంగా రాజేష్ అనే వ్యక్తి గవర్నర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 05:44 PM IST
  • తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది
  • లైవ్‌లో గవర్నర్ తమిళసై
  • గవర్నర్‌ను అనకూడని మాటన్న నెటిజన్
Governor Tamilsai: తెలంగాణ గవర్నర్‌ను అనకూడని మాటన్న నెటిజన్!

Netizens trolls Telangana Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన గవర్నర్ తన ఆవేదనను చెప్పుకున్నారు. మహిళా గవర్నర్ అని తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుంచి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి ప్రధానికి తమిళిసై వివరించారు. 

తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై విషయం చల్లారక ముందే సోషల్ మీడియాలో చర్చలు మొదలైయ్యాయి. ఇందులోనే భాగంగా రాజేష్ అనే వ్యక్తి గవర్నర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఓ టీవీ ఛానెల్ లైవ్‌లో గవర్నర్ తమిళసై మాట్లాడుతుండగా.. నెటిజన్లు చాట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ గవర్నర్‌ను అనకూడని మాట అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా వితండవాదం చెయ్యసాగాడు. అలా చేస్తే జైలు పాలవ్వక తప్పదని కూడా వేరే నెటిజన్ ట్వీట్ చేసినా ఎలాంటి భయం లేకుండా ట్వీట్ చేస్తూనే వెళ్లాడు.

గవర్నర్ తమిళసైని అసభ్య పదజాలంతో దూషించిన ఆ నెటిజన్‌కు సంబందించిన స్క్రీన్ షాట్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ట్వీటుపై తెలంగాణ మహిళ మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ క్రైం పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలంగాణ మహిళ మండలి హెచ్చరించింది. రాష్ట్ర ప్రధమ మహిళపై జరిగిన ఈ ట్రోలింగ్‌పై ప్రతిఒక్కరు అమండిపడుతున్నారు. 

మరోవైపు ఓ పార్టీ ఫేస్‌బుక్ పేజీల్లో గవర్నర్ తమిళసైపై దిగజారి చేసిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గవర్నర్‌ను దిష్టి బొమ్మగా చూపిస్తూ చేసిన ఆ పోస్ట్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇలాంటి వాటిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రథమ మహిళపై ఈ విధమైన పోస్టులు సమంజసం కాదంటూ గవర్నర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 

Also Read: Precaution Dose: ప్రికాషన్ డోస్ సర్వీస్ చార్జీ ఎంతంటే... అంతకుమించొద్దని కేంద్రం ఆదేశాలు..

Also Read: Rahul Tewatia: ఎంఎస్ ధోనీ త‌ర్వాత.. ఆ రికార్డు రాహుల్ తెవాటియాదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News