Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..

Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చిన ఈటెలకు తెలంగాణ బిజెపి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 10, 2024, 11:54 AM IST
Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..

Telangana New BJP chief: అవును తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఈటల రాజేందర్ పేరు వినిపించింది. ఆయనే దాదాపు ఖాయమనే పేరు వచ్చింది. ఇప్పటికే ఈటల మల్కాజ్గిరి ఎంపికా  గెలిచిన ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని  అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలంగాణ నుంచి సీనియర్ జాబితాలో బండి సంజయ్ కు చోటు దక్కింది. దీంతో ఈటలకు నిరాశ తప్పలేదు. మరోవైపు ఈటెల కాకుండా డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు వినపించాయి. కానీ అనూహ్యంగా తెలంగాణ బీజేపీ రథ సారధిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు పేరు తెరపైకి వచ్చింది.  

ఈయన తెలంగాణలో బిజెపిలో  సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా  రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు.
తాజాగా బీజేపీ హై కమాండ్   అన్ని అంశాలను పనిలోకి తీసుకొని ఎన్ రామచంద్ర రావు పేరును బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా  దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి అగ్ర వర్గణ పార్టీ అనే పేరు ఉంది. ఇపుడిపుడే ఆ ముద్ర చెరిపేసుకుంటుంది. కానీ  ఇప్పుడు  సడెన్ గా తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న ఎన్. రామచంద్రరావు ఏ ప్రాతిపదికన ఎంపిక చేసారో చూడాలి. కేవలం పార్టీ విధేయత, ఆర్ఎస్ఎస్ అండదండలు, మొదటి నుంచి పార్టీలో ఉండటం వంటివి రామచంద్రరావుకు కలిసొచ్చే అంశాలు. పైగా క్రిమినల్, సివిల్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న లాయర్ కూడా.

ఇప్పటికే తెలంగాణ  రాష్ట్రంలో బిజెపి అధికారం వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈయన నియమితులైతే.. ఆ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. ఈ నేపథ్యంలో చివరి యేడాదిలో ఈటల లేదా డీకే అరుణ వంటి సీనియర్ నేతలకు తెలంగాణ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టిఆర్ఎస్ నుంచి బిజెపికి వచ్చిన ఈటెలకు కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై కొంత మంది సీనియర్ బీజేపీ నేతలు  అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  అటు డీకే అరుణ, రఘునందన్ రావులు కూడా బయటి పార్టీల నుంచి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారు.  ఈ ముగ్గురు కూడా బీజేపీ తరుపున తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. ఈ ఈక్వెషన్స్ అన్ని పరిగణలోకి తీసుకొని  ముందు నుంచి పార్టీలో ఉన్న రామచంద్ర రావు వైపు  బిజెపి అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఏదైనా అంతగా మాస్ లో అంత ఫాలోయింగ్ లేని రామచంద్ర ఎంపిక తెలంగాణ బిజెపికి కొత్త ఊపు తీస్తుందా అనేది చూడాలి.  

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News