Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారింది. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొవిడ్ కారణంగా గత వారం రోజులుగా ఇంటికి పరిమితమయ్యారు రేవంత్ రెడ్డి. ఈ వారం రోజుల్లోనే మునుగోడు రాజకీయ చిత్రం మారిపోయింది. అటు అధికార పార్టీ, ఇటు టీఆర్ఎస్ జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాయి. కాంగ్రెస్ ను దాదాపుగా ఖాళీ చేశాయి. మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచ్ లలో కొందరు టీఆర్ఎస్ లో చేరిపోగా... మెజార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కమలం గూటికి చేరిపోయారు. దీంతో మునుగోడు కాంగ్రెస్ కేడర్ లో నిస్తేజం అమలుకుంది. ఇంకా మిగిలిన నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.
కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న రేవంత్ రెడ్డి.. శనివారం నుంచి మునుగోడు నియోజకతవర్గంలో పర్యటించనున్నారు. ప్రతి గ్రామం తిరిగేలా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ సిద్దమైంది. మునుగోడులో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.కాళ్లు మొక్కుతాం ఓటేయండి అని నినాదంతో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి గ్రామంలో ఓటర్లను కలిసి వాళ్ల కాళ్లు మొక్కి కాంగ్రెస్ ను దీవించాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. ఇలా దాదాపు లక్ష మంది కాళ్లు మొక్కి ఓట్లు అడిగేలా స్కెచ్ వేశారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ బాటలోనే కాంగ్రెస్ నేతలంతా ఓటర్లు కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్నారని తెలుస్తోంది.
శనివారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి.. ఒకే రోజు 5 మండలాల్లో 3 పాదయాత్ర చేయబోతున్నారు. దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాలలో జయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నేతలు నివాళులు అర్పించనున్నారు. మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో జనంలోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన స్టిక్కర్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు. బిల్డర్ చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్, బీజేపీ నుంచి రెడ్డి అభ్యర్థులే రంగంలో ఉండటంతో... బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనలోనూ కాంగ్రెస్ ఉందనే చర్చ సాగుతోంది.
మన మునుగోడు… మన కాంగ్రెస్…#ManaMunugodeManaCongress pic.twitter.com/qrfflErQrG
— Revanth Reddy (@revanth_anumula) August 19, 2022
Also read:China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!
Also read:IND vs ZIM: మరో సిరీస్‌పై కన్నేసిన టీమిండియా..రేపే జింబాబ్వేతో రెండో వన్డే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook