Monkeypox Alert: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాల్లో మంకీపాక్స్ ఉధృతి అధికంగా ఉంది. కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. ఈక్రమంలో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. వైద్యులు సైతం పలు సూచనలు చేస్తున్నారు.
భారత్‌లోనూ మంకీ పాక్స్ కలవర పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఈనేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న బాధితులను ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల మంకీపాక్స్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఒంటిపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఉన్న వారిని గుర్తించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ ఆదేశించింది.
ఎవరైనా మంకీపాక్స్ అనుమానితులు ఉంటే వెంటనే జిల్లా వైద్యాధికారులను కలవాలని సూచించింది. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీకి పంపిస్తున్నారు. మంకీ పాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్నికేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ వైరస్‌కు మశూచికి వాడే టీకాలు పనిచేస్తాయా అన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.
మంకీపాక్స్ సోకిన వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ముఖం, చేతులపై దద్దుర్లు, చిన్న బొబ్బలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. మంకీపాక్స్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అలర్ట్ అయ్యాయి.
Also read:Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!
Also read:TS Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..హెచ్‌ఆర్‌ఏ పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook