Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?

Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 7, 2024, 01:19 PM IST
  • మళ్లీ వివాదంలో కొండా సురేఖ..
  • చర్యలు తీసుకొవాలని హిందు సంఘాల డిమాండ్..
Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?

minister konda surekha another controversy: తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల వివాదాలకు కేరాఫ్ గా మారారని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆమె ఇప్పటికే అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఏకంగా హైకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. అదే విధంగా మంత్రి కోండా వ్యాఖ్యల్ని సినిమా ఇండస్ట్రీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొండా సురేఖ మాత్రం ఏమాత్రం తగ్గేదేలా అన్నట్లు ముందుకు వెళ్తున్నారు.

కొన్నినెలల క్రితం వేముల వాడకు కొండా సురేఖ వెళ్లినప్పుడు అక్కడ స్వామివారికి మహా నైవేద్యంకు ఆలస్యం జరిగింది. మంత్రి పర్యాటన వల్ల.. స్వామివారికిమసమయానికి చూపించాల్సిన నైవేద్యంను అక్కడి వాళ్లు ఆలస్యం చేశారు. అప్పట్లో ఇది వివాదంలో మారిన విషయం తెలిసిందే. మరల కొండా సురేఖ.. వేముల వాడలోనే మరో వివాదానికి కారణమయ్యారని తెలుస్తొంది.

ఈ క్రమంలో మంత్రి కోండా సురేఖ ఆదేశాల మేరకు.. ఆలయ ఈవో వినోద్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని.. విశ్వహిందు పరిషత్,భజరంగ్ దళ్ లు మండిపడుతున్నాయి. కొండా సురేఖ అనుచరుడైన రాంబాబుకు ఆగస్టు 12న 49 కోడెలను.. అన్యమతస్తులకు అప్పచెప్పినట్లు తెలుస్తొంది. నిబంధనల ప్రకారం నడుచుకొకుండా.. ఈవో ఇష్టరితీన వ్యవహరించాడని సమాచారం. దీనిపై వీహెచ్ పీ, హిందు సంఘాలు.. వరంగల్ జిల్లా గీసుకొండ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.

Read more: Yadadri Road Accident: చెరువులో కారు దూసుకెళ్లిన ఘటన.. వెలుగులోకి వస్తున్న విస్తు పోయే విషయాలు..

పశువుల వ్యాపారి అయిన.. అతనికి కోడెలను అప్పగించడంపై.. విశ్వహిందు పరిషత్, హిందు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో వెంటనే అతనిపై చర్యలు తీసుకొవాలని. మంత్రి కోండా సురేఖపై సైతం ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కొండా సురేఖ మరోసారి వార్తలలో నిలిచినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News