Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. స్తంభించిన టికెట్ వ్యవస్థ

Metro Employees Strike In Hyderabad: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమకు జీతాలు పెంచాలని వారు ఆందోళన బాట పట్టారు. దీంతో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు టికెటింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రయాణికులు భారీ క్యూకట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 12:02 PM IST
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకి సమ్మె ఎఫెక్ట్.. స్తంభించిన టికెట్ వ్యవస్థ

Metro Employees Strike In Hyderabad: హైదరాబాద్ మెట్రోపై సమ్మె ఎఫెక్ట్ పడింది. దీంతో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్‌ వరకు పనిచేస్తున్న రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆయా స్టేషన్లలో టికెటింగ్ వ్యవస్థ నిలిచిపోయింది. గత ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. 

5 ఏళ్లుగా తమకు కేవలం 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని వారు వాపోతున్నారు. తమకు 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు శాలారీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల సమ్మెతో అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూ కట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తమకు ఇచ్చే జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కనీసం తమకు భోజనం చేసే సమయం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఐట్ సోర్సింగ్ కింద ఉద్యోగులు పని చేస్తుండగా.. మెట్రోను కియోలిస్ సంస్థ మెయింటెన్ చేస్తోంది. టికెటింగ్ వ్యవస్థలో 300 ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇవాళ కేవలం 150 మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరైనట్లు తెలిసింది.  

ఉద్యోగుల ఆందోళనపై మెట్రో మేనేజ్‌మెంట్ స్పందించింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బంది చెప్పేది అంతా అబద్దమని చెబుతోంది. సిబ్బంది సమస్యలు తెలుసుకుంటామని పేర్కొంది. 

Also Read: AP Politics: టీడీపీకి షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం  

Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News