CM Kcr: తెలంగాణలో రేపే సామూహిక జాతీయ గీతాలాపన..ఎక్కడివారెక్కడే గప్‌చుప్..!

CM Kcr: దేశంలో భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 15, 2022, 09:54 PM IST
  • భారత వజ్రోత్సవ వేడుకలు
  • తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు
  • రేపే జాతీయ గీతాలాపన
CM Kcr: తెలంగాణలో రేపే సామూహిక జాతీయ గీతాలాపన..ఎక్కడివారెక్కడే గప్‌చుప్..!

CM Kcr: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైంది. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులోభాగంగానే ఈనెల 8 నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 22 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈనెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరగనుంది. 

ఈక్రమంలో రేపు(మంగళవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్‌ ఆబిడ్స్ జీపీవో సర్కిల్‌లో గీతాలాపన కార్యక్రమం జరగనుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఆబిడ్స్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలను సీఎస్ సోమేష్‌కుమార్ పరిశీలించారు. ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. 

ఈసందర్భంగా సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్ల వద్ద ఎక్కడివారు అక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సీఎస్ సోమేష్‌కుమార్ ఆదేశించారు. హైదరాబాద్‌లో అన్ని సర్కిళ్ల వద్ద ఈకార్యక్రమం జరగనుంది. ఇందుకు ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

గీతాలాపన సమయంలో కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్‌ సిగ్నళ్లు వేయనున్నారు. ఆ సమయంలో నిమిషం పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో వాహనదారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైతం పాల్గొంటారు. ఈసమయంలో వాహనాల రద్దీ, ట్రాఫిక్‌ జామ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశాభివృద్ధి కృషి చేస్తున్నామని..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో జెండా వందనం వైభవంగా సాగింది. గోల్కొండలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ఇటు విజయవాడలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని..జాతీయ జెండాను ఎగురవేశారు.

Also read:Telangana Rajbhavan: రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య దూరం పెరిగిందా..తేనీటి విందుకు రాని సీఎం కేసీఆర్..!

Also read:Karnataka Accident: కర్ణాటకలో నెత్తురోడిన రోడ్డు..ఐదుగురు దుర్మరణం, పలువురికి గాయాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News