Godavari Floods: గోదావరి వరదలపై మావోయిస్టుల సంచలన లేఖ! మరీ ఇంత దారుణం జరిగిందా..?

Godavari Floods: జూలై నెలలోనే తెలుగు రాష్ట్రాలపై వరుణ ప్రతాపం కనిపించింది. దాదావు వారం రోజుల పాటు నాన్ స్టాప్ గా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా  మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు.

Written by - Srisailam | Last Updated : Jul 21, 2022, 03:15 PM IST
  • గోదావరి వరదలపై మావోయిస్టుల లేఖ
  • ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై ఫైర్
  • లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్
Godavari Floods: గోదావరి వరదలపై మావోయిస్టుల సంచలన లేఖ! మరీ ఇంత దారుణం జరిగిందా..?

Godavari Floods: జూలై నెలలోనే తెలుగు రాష్ట్రాలపై వరుణ ప్రతాపం కనిపించింది. దాదావు వారం రోజుల పాటు నాన్ స్టాప్ గా వర్షాలు కురిశాయి. ఏపీ కంటే తెలంగాణ వర్షం ఎక్కువగా కురిసింది. ముఖ్యంగా గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో కుంభవృష్టి కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 24 గంటల్లోనే 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది అంటే వర్ష బీభత్సం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయియ. గోదావరి మహోగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో వరదొచ్చింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం ఏకంగా 72.8 అడుగులకు చేరింది. పోలవరం మీదుగా దాదాపు 28 లక్షల వరద ప్రవహించింది. ధవళేశ్వరంలోనూ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదలు పోటెత్తడంతో గోదావరి తీర గ్రామాలు నీట మునిగాయి. వందలాది గ్రామాలు దాదాపు వారం రోజుల పాటు జలమయం అయ్యాయి. వేలాదిమందిని పునరావస కేంద్రాలకు తరలించారు. భద్రాచలంలో నీటిమట్టం 48 అడుగులకు తగ్గినా ఇంకా పలు లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. 

భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల తెలంగాణ లో  సుమారు 14 వందల కోట్ల నష్డం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక పంపించింది.  తక్షణమే వెయ్యి కోట్ల రూపాయల సాయం విడుదల చేయాలని మోడీ సర్కార్ ను కోరింది తెలంగాణ ప్రభుత్వం. అదే సమయంలో భారీ వర్షాలు, వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యాయని, వరదను సరిగా అంచనా వేయలేక వందలాది గ్రామాలను నీట ముంచారని విపక్షాలు ఆరోపించాయి. తాజాగా భారీ వర్షాలు, వరదలకు సంబంధించి మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు  రాసిన లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. 

భద్రాద్రి కొత్త గూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేదని.. వరద బాధితులకు ఆకలితో అలమటించారని తమ లేఖలో మావోయిస్టులు విమర్శించారు. గోదావరి వరదలతో ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500 గ్రామాలు ముంపుకు గురయ్యాయని తెలిపింది. ఏపీ, తెలంగాణలో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. బీకే ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో మావోయిస్టు పార్టీ ఈ లేఖ విడుదల చేసింది. 

Also Read: వ్యాయామం చేస్తూనే.. పంజాబీ పాటకు డాన్స్ చేసిన విరాట్ కోహ్లీ! వరుణ్ ధావన్ ఏమన్నాడంటే

Also Read: Liger Trailer Review: విజయ్ దేవరకొండ లైగర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News