Dharmapuri Arvind Fires On Election Staff In Nizamabad: రెండు తెలుగు స్టేట్స్ లలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా ఓటింగ్ నడుస్తోంది. ప్రజలంతా స్వచ్చదంగా ఓటింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇక రాజకీయనాయకులు, సినిమా సెలబ్రీటీలు సైతం ఉదయం నుంచి ఓటు వేయడానికి క్యూలైన్ లలో నిలబడ్డారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్, చిరంజీవీ, తదతరులు ఉదయంపూట తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో బీజీపీ, మజ్లీస్ లు నువ్వా.. నేనా అన్న విధంగా ప్రచారం నిర్వహించాయి.
నిజామాబాద్ ఎన్నికల అధికారితో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి వాగ్వాదం.. pic.twitter.com/vO8P9hpFlZ
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2024
ఎన్నికలలో ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఒకరికి బదులుగా మరోకరు ఓటు వేయకుండా ఈసీ పకట్భందీ చర్యలు తీసుకుంది. పోలింగ్ ఏజెంట్లు ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత, స్లిప్ ల మీద ఐడెంటీఫికేషన్ చూసిన తర్వాత మాత్రమే అధికారులు ఓటింగ్ కు అనుమతిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ బీజీపీ ఎంపీ అభ్యర్థి స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కొందరు ఓటింగ్ వేసేటప్పుడు ఫెస్ రికగ్నిషన్ చేయకుండానే ఓటింగ్ అనుమతిస్తున్నారని ఆయనకు తెలిసింది. దీంతో ఆయన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ముస్లిం ఓటర్లను ఫెస్ రికగ్నీషన్ చేసిన తర్వాతనే ఓటింగ్ కు అనుమతించాలని సూచించారు.
ఈక్రమంలో అక్కడి అధికారులపై ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. సరైన విధంగా ఫెస్ రికగ్నిషన్ లేకుండా ఓటింగ్ కు ఎలా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. అక్కడి ప్రిసైండింగ్ అధికారులు కూడా కాస్తంతా చిరాకు తెప్పించే విధంగా మాట్లాడారు. దీంతో అర్వింద్ మీరు డ్యూటీలు చేస్తున్నారా.. టైంపాస్ చేస్తున్నారా.. అంటూ అక్కడ విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిపై మండిపడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన వారిని ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాతే ఓటింగ్ కు అనుమతించాలని ఆయన కోరారు.ముఖ్యంగా కొందరు బుర్ఖాలుధరించి ఒకరికి బదులుగా మరోకరు, మహిళలకు బదులు పురుషులు కూడా ఓటు వేసిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి.
Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
ప్రస్తుతం ఎన్నికలను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ కూడ ఎలాంటి అక్రమాలు, మోసాలు లేకుండా స్వేచ్చగా, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీని కోరింది. ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా ఇలాగే పోలింగ్ కేంద్రాలలో కొందరు మహిళల ఓటర్ ఐటీలను పరిశీలించారు. అనుమానం వచ్చిన వారిని బుర్ఖా తీసి మరీ చూశారు. మహిళా పోలీసులు ఓటు వేసే వారందరిని ప్రాపర్ గా ఫెస్ రికగ్నిషన్ చేసిన తర్వాతే ఓటింగ్ కు అనుమతించాలని మాధవీలత కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter