హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా అందులో రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్ పార్టీ 9 లోక్ సభ స్థానాలను గెల్చుకుంది. మిగతా 8 లోక్ సభ స్థానాల్లో నాలుగు స్థానాల్లో బీజేపి విజయం సాధించగా మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, మరో స్థానంలో ఎంఐఎం పాగా వేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఈ లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలిచి తమ ఉనికిని కాపాడుకోగలిగింది. ఇక బీజేపి విషయానికొస్తే, తెలంగాణలో 4 స్థానాలు గెలిచి ఆ పార్టీ తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా పార్టీ ప్రతిష్టను పెంచుకోవడం విశేషం. లోక్ సభ వారీగా విజయం సొంతం చేసుకున్న అభ్యర్థుల జాబితా ఇలా వుంది.
ఆదిలాబాద్(ఎస్టీ)-సోయం బాపు రావు - బీజేపి
భువనగిరి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - కాంగ్రెస్
మల్కాజిగిరి-అనుముల రేవంత్ రెడ్డి - కాంగ్రెస్
చేవెళ్ల - డా. గడ్డం రంజిత్ రెడ్డి - టీఆర్ఎస్
హైదరాబాద్ - అసదుద్దీన్ ఓవైసి
కరీంనగర్ - బండి సంజయ్ కుమార్- బీజేపి
ఖమ్మం - నామా నాగేశ్వర రావు - టీఆర్ఎస్
మహబూబాబాద్ - కవిత మాలోతు - టీఆర్ఎస్
మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి -టీఆర్ఎస్
మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి - టీఆర్ఎస్
నాగర్ కర్నూలు(ఎస్సీ) పోతుగంటి రాములు-టీఆర్ఎస్
నల్గొండ-ఉత్తమ్ కుమార్ రెడ్డి నలమాడ-కాంగ్రెస్
నిజామాబాద్ - అరవింద్ ధర్మపురి - బీజేపి
సికింద్రాబాద్- జి కిషన్ రెడ్డి-బీజేపి
వరంగల్ - దయాకర్ పసునూరి-టీఆర్ఎస్
జహీరాబాద్-బిబి పాటిల్-టీఆర్ఎస్
పెద్దపల్లి-వెంకటేశ్ నేత- టీఆర్ఎస్
తెలంగాణలో గెలిచిన లోక్ సభ అభ్యర్థుల జాబితా.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు