నిర్మల్ ప్రచార సభలో కేసీఆర్ నోట మళ్లీ రిజర్వేషన్ల మాట

                                     

Last Updated : Nov 22, 2018, 08:57 PM IST
నిర్మల్ ప్రచార సభలో కేసీఆర్ నోట మళ్లీ రిజర్వేషన్ల మాట

ఆదిలాబాద్: తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలను గెలిపిస్తే రిజర్వేషన్లను తీసుకొస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. గత ఎన్నికలో తాను ముస్లిం రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని..దీనికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. రిజ్వేషన్ల సాధన కోసం తాము అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. న్యాయపరంగా కూడా తాము పోరాడుతున్నామన్ని కేసీఆర్ వివరణ ఇచ్చారు.

17 ఎంపీ స్థానాలు ఇవ్వండి.. రిజర్వేషన్లు సాధిస్తాం

కేంద్రంలో మోడీ సర్కార్ ఉండటం వల్ల తాము రిజ్వేషన్లు సాధించలేకపోయామని కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ఆమోదం తెలిపితే రిజర్వేషన్ల సాధింగలమన్నారు. ఈ సారి మోడీ సర్కార్ వచ్చే పరిస్థితి లేదు..అలాగని కాంగ్రెస్ అధికారం చేపట్టడం కలే. ప్రాంతీయ పార్టీలదే హవా.. రిజర్వేసన్ల సాధన కోసం ఇదోక సువర్ణ  అవకాశమని జనాలకు ఊరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ఉన్న 17 స్థానాల్లో  టీఆర్ఎస్-ఎంఐఎం అభ్యర్ధులను గెలిచిపించండి..రిజర్వేషన్లు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎస్టీ, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విసయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు కేసీఆర్ పై పదే పదే విమర్శలు గుప్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రిజర్వేషన్ల అంశంపై ఇలా వివరణ ఇచ్చారు.

డబ్బులతో ఓవైసీని కొనలేరన్న కేసీఆర్

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ అసద్ ఓ నియోజకవర్గంలో ప్రచారానికి రాకుండా ఉంటే రూ.25 లక్షల ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపారు.. 25 కోట్లు ఇచ్చినా అదస్‌దుద్దీన్  ఆ పని చేయలేరని  కేసీఆర్ వ్యాఖ్యానించారు. చిన్న చిన్న విభేధాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు కలసి పని చేస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నగంలోని రాజేందర్ నగర్ నియోజకవర్గం విషయంలో టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

Trending News