Muthireddy Yadagiri Reddy's Daughter Files Forgery Case: జనగాం: స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూకబ్జా కేసులో వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయనపై కేసు పెట్టింది ఎవరో కాదు.. స్వయంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డినే ఆయనపై హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లాలోని చేర్యాలో తన సంతకాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫోర్డరీ చేశారంటూ తుల్జా భవాని రెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేర్యాల చౌరస్తాలో చేరువుని ఆనుకుని తనకు ఉన్న 1 ఎకరం 20 గుంటల భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తనకు తెలియకుండానే తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కాజేశారని ఆమె ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే, గతంలో ఇదే భూమి కబ్జా విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. చెరువుని ఆనుకుని ఉన్న ఇదే స్థలంలో వారం వారం పశువుల సంత జరిగేదని.. కానీ అదే పశువుల సంత స్థలాన్ని ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి రాత్రికి రాత్రే కబ్జా చేసి చుట్టూ ప్రహరి గోడ నిర్మించారని అప్పట్లో విపక్షాలన్నీ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విపక్షాల నేతృత్వంలోనే స్థానిక ఆందోళనకారులు ఆ స్థలాన్ని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెరలోంచి విడిపించే ప్రయత్నంలో భాగంగా ఆయన నిర్మించుకున్న ప్రహరి గోడ నిర్మాణాన్ని పూర్తిగా కూలగొట్టి నేలమట్టం చేశారు.
మరోసారి ప్రహరి గోడ నిర్మించిన ముత్తిరెడ్డి
జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసినట్టుగా చెబుతున్న స్థలం చుట్టూ ఉన్న ప్రహరి గోడను విపక్షాలు కూలగొట్టిన మరునాడే రాత్రికి రాత్రే ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి మరోసారి నిర్మించి తనను ఎవ్వరూ ఏమీ చేయలేరంటూ విపక్షాలకు సవాల్ విసిరారు. అప్పట్లో ఈ ఘటన పతాక శీర్షికలకు ఎక్కడంతో పాటు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి : Priyanka Gandhi Speech: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. హామీలు నెరవేర్చకపోతే మీరే సర్కారును కూల్చేయండి
కూతురు ఫిర్యాదుతో మరోసారి తెరపైకొచ్చిన స్థల వివాదం.. అంతా గందరగోళం..
తన పేరిట ఉన్న స్థలాన్ని కన్న తండ్రే కబ్జా చేశారంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చేర్యాలలోని ఈ స్థలం చుట్టూ తిరుగుతున్న వివాదం మరోసారి తెరపైకొచ్చింది. అయితే, ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే.. అసలు ప్రభుత్వ స్థలాన్ని ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డినే కబ్జా చేశారంటూ విపక్షాలు ఆందోళనకు దిగితే... ఇప్పుడు అదే స్థలాన్ని తన తండ్రి కబ్జా చేశారంటూ ఆయన కూతురు పోలీసు స్టేషన్ మెట్లెక్కడం ఏంటా అని జనం అయోమయానికి గురవుతున్నారు. అయితే, ఒకవేళ గతంలో ఈ స్థలాన్ని కబ్జా చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ స్థలాన్ని తన కూతురు తుల్జా భవాని పేరిట రాయించి ఉంటారని.. కానీ ఇప్పుడు అదే స్థలాన్ని తిరిగి తీసుకోవడం జరిగి ఉండుంటుంది అని ఇంకొంతమంది సందేహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు ఇంకా స్పందించలేదు. ఏదేమైనా ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు, ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి లేదా ఆయన కూతురు తుల్జా భవాని మీడియా ముందుకొచ్చి అసలు జరిగింది ఏంటో చెబితే కానీ అసలు విషయం అర్థం అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు చేర్యాల వాసులు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Election Promises: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK