Republic Day 2023: రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు.. సీఎం కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధత!

Republic Day 2023 Ceremony in Raj Bhavan. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 26, 2023, 07:08 AM IST
  • రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు
  • సీఎం కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధత
  • 7 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ
Republic Day 2023: రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు.. సీఎం కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధత!

Is Telangana CM KCR attend Republic Day 2023 Ceremony in Raj Bhavan: గత ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని బుధవారం తెలంగాణ ప్రభుత్వంను హైకోర్టు ఆదేశించడంతో.. ఏర్పాట్లు ఘనంగా చేశారు. పోలీసు బలగాల కవాతు, గవర్నర్‌ ప్రసంగం, ఇతర కార్యక్రమాలకు రంగం సిద్ధం అయింది. గురువారం ఉదయం 6.50 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో పోలీసు బలగాల నుంచి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు. 7 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

గణతంత్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార-విపక్ష పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులకు రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వైరం కారణంగా సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌ వేడుకలకు వెళతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోకొద్ది సేపట్లో ఈ విషయంపై స్పష్టత రానుంది. 

గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంపై గవర్నర్‌ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారించిన హైకోర్టు.. కరోనా కారణంగా పరేడ్‌ నిర్వహించడం లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వేడుకలు నిర్వహించాలని, ప్రజలను కూడా అనుమతించాలని పభుత్వంను ఆదేశించింది. అయితే ఆఖరి నిమిషంలో పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేయడానికి ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. చివరకు రాజ్‌భవన్‌లోనే పరేడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.   

Also Read: Sandeepa Dhar Pics: బెడ్‌పై సందీప ధార్ హాట్ స్టిల్స్.. ఒంపుసొంపులతో కాకపుట్టితోన్న కాశ్మీర్ భామ!  

Also Read: Honey Rose Hot Pics: శారీలో హనీ రోజ్ ఒంపుసొంపులు.. బ్యాక్ చూస్తే గుండెలు బరువెక్కాల్సిందే!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News