IT Company Fraud: నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఐటీ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయి. మంచి జీతాలు ఇస్తామని వారి నుంచి డబ్బులు తీసుకుని ప్లేట్ ఫిరాయిస్తున్నారు. కొన్ని రోజుల పాటు నమ్మకంగా ఉండి బోర్డు తిప్పేస్తున్నారు. దీంతో యువతియువకులంతా రోడ్డున పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ మాదాపూర్‌లో చోటుచేసుకుంది.
మాదాపూర్‌లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో 800 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు 2 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.20 కోట్లు వసూలు చేసి యువతియువకులకు కుచ్చుటోపి పెట్టింది. రెండు నెలలపాటు నమ్మకంగా ఉంటూ ట్రైనింగ్ పేరిట జీతాలు సైతం చెల్లించారు.
ఇటీవల రెండు వారాల క్రితం ఒక్కసారిగా ఆ కంపెనీ వెబ్‌సైట్, మెయిల్స్ బ్లాక్ అయ్యాయి. సంస్థకు సంబంధించిన ఆఫీస్‌లో ఉద్యోగులు, కంపెనీ బోర్డు లేకపోవడంతో నిరుద్యోగులంతా షాక్ అయ్యారు. మోసపోయినట్లు గ్రహించి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐనా పోలీసులు స్పందనలేకపోవడంతో మాదాపూర్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఐటీ కంపెనీ మోసంపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ స్పందించారు. ఈనెల 28న హన్మకొండకు చెందిన యువకుడు తమకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. కొత్తగూడలోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిరుద్యోగుల నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తులను గుర్తించామని..త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఇలాంటి కంపెనీల పట్ల జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also read:Ashish Nehra IPL Record: ఆశిష్ నెహ్రా అరుదైన రికార్డు.. తొలి ఇండియన్‌గా..!
Also read: YSRCP MLC WARNING: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook