Hyderabad Water Pollution Incident: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట వడ్డెర బస్తీలో కలుషిత మంచి నీటి బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా మరో 15 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. ప్రస్తుతం 52 మంది కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 26 మంది రికవరీ అయ్యారు. బాధితులకు చికిత్స కోసం కొండాపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
మరోవైపు, జలమండలి ఎండీ దాన కిషోర్ వడ్డెర బస్తీలో ఇంటింటికి తిరిగి అక్కడి ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బస్తీలోని ఇళ్లకు సప్లై అవుతున్న నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని... ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల పక్కనే ఉన్న వాటర్ పైప్ లైన్ కనెక్షన్ వల్లే తాగునీరు కలుషితం అవుతున్నట్లు భావిస్తున్నారు.
బస్తీలో గత వారం రోజులుగా కలుషిత తాగు నీరు సప్లై అవుతోందని స్థానికులు చెబుతున్నారు. నీటి నుంచి దుర్వాసన వస్తోందని... ఆ నీటిని తాగితే వాంతులు, విరేచనాలు, జ్వరాలు వస్తున్నాయని వాపోతున్నారు. గత గురువారం బస్తీలో నివాసముండే భీమయ్య (27) అనే వ్యక్తి కలుషిత మంచి నీరు తాగి మృతి చెందాడు. భీమయ్య రెండేళ్ల కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చలి, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
Also Read: Thippeswamy: చివరి నిమిషంలో 'తిప్పేస్వామి'కి చేజారిన పదవి.. బావమరిదికే మళ్లీ ఛాన్స్.
Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook