Metro Services Time Extended to 2 AM on 31st Night: ఆంగ్ల నూతన సంవత్సరాది మరికొన్ని గంటల్లో రానున్న క్రమంలో ప్రపంచమంతా వేడుకలకు సిద్ధం అవుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని కీలక చర్యలకు సిద్ధమైంది. ఇక తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రతిరోజు 11 గంటల వరకు అమ్మే మద్యాన్ని 31స్ట్ నైట్ ఒంటిగంట వరకు మద్యం అమ్మవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని మెట్రో రైలు యాజమాన్యం కూడా ఒక కీలక ప్రకటన చేసింది. అదేమంటే న్యూ ఇయర్ వేడుకల కోసం మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు నడపడనుంది. మామూలుగా మెట్రో రైలు చివరి ట్రైన్ రాత్రి 11 గంటలకు చివరి స్టేషన్ నుంచి బయలుదేరేది కానీ 31 నైట్ అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. రాత్రి ఒకటి గంటలకు మొదటి స్టేషన్ నుండి చివరి మెట్రో రైలు బయలు దేరనున్నది.
అదే విధంగా రెండు గంటలకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు, ఈ మేరకు మెట్రో అధికారులు కీలక ప్రకటన చేశారు. రేపు ఎక్కువ మంది మద్యం సేవించే అవకాశం ఉండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే అవకాశాలు ఉండటంతో ఈ మేరకు రేపు మెట్రో రైలు సమయం పొడగించారు అధికారులు.
నూతన సంవత్సర సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపకుండా , డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడకుండా మెట్రో రైల్ సేవల సమయం పొడగించినట్లు వెల్లడించారు. అయితే తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మెట్రో అధికారులు హెచ్చరించారు.
Also Read: Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా ప్రార్ధనలు రిషబ్ పంత్ కోసమేనా.. లేక?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook