206 Kidney Stones Removed: ఒకటి కాదు, రెండు కాదు.. ఓ వ్యక్తి కిడ్నీ నుంచి 206 రాళ్లను తొలగించారు వైద్యులు. కీ హోల్ సర్జరీ ద్వారా గంట పాటు శ్రమించి రాళ్లన్నీ తొలగించగలిగారు. నల్గొండకు చెందిన వీరమళ్ల రామలక్ష్మయ్య అనే వ్యక్తికి హైదరాబాద్‌లోని అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు.
56 ఏళ్ల వీర రామలక్ష్మయ్య గత ఆర్నెళ్లుగా కిడ్నీ భాగంలో నొప్పితో బాధపడుతున్నాడు. నల్గొండలో స్థానికంగా ఉన్న కొందరు వైద్యుల వద్ద చూపించుకుంటూ మందులు వాడుతున్నాడు. అయితే మందులు వాడిన ప్రతీసారి తాత్కాలికంగా నొప్పి తగ్గడం... ఆ తర్వాత మళ్లీ తిరగబెట్టడం జరుగుతూ వస్తోంది. కొన్నిసార్లు భరించలేని నొప్పితో కనీసం తన పనులు తాను కూడా చేసుకోలేకపోయేవాడు. ఇక లాభం లేదనుకుని హైదరాబాద్ వెళ్లి అవేర్ గ్లెనెగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో చూపించుకున్నాడు.
అక్కడ రామలక్ష్మయ్యకు స్కానింగ్, ఇతరత్రా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతని ఎడమ వైపు కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ ద్వారా వాటిని తొలగించాల్సి వస్తుందని చెప్పారు రామలక్ష్మయ్య అందుకు అంగీకరించడంతో ఇటీవల కీ హోల్ సర్జరీ నిర్వహించారు. గంట పాటు చేసిన సర్జరీలో మొత్తం 206 రాళ్లు బయటపడ్డాయి. సర్జరీ తర్వాత రామలక్ష్మయ్య ఆరోగ్యం బాగుందని... సర్జరీ జరిగిన రెండో రోజే అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని ఆసుపత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు.
ప్రస్తుత వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది డీహైడ్రేషన్ బారినపడుతున్నారని... డీహైడ్రేషన్‌తో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొనడం గమనార్హం. వేసవిలో ఎక్కువ నీళ్లు తాగాలని... శరీరం ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.