Munneru: గత వారం పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఏపీలో విజయవాడ బుడమేరు పొంగి పొర్లడంతో గత 30 యేళ్లలో ఎన్నడు లేనట్టుగా బెజవాడను వరద ముంచెత్తింది. దీంతో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. మరోవైపు ఖమ్మం జిల్లలో మున్నేరు అక్కడ ప్రజలను కన్నీరు పెట్టించింది. రాత్రి వరకు హాయిగా కులాసాగా ఉన్న ప్రజలు ఉదయం లేచి చూసేసరికి అక్కడ ప్రజలను నిండా ముంచేసింది. జీవింతాతం ఎంతో కష్టపడి పోగుచేసుకున్న ఎన్నో విలువైన వస్తువులు వరద నీటికి పనికి రాకుండా పోయాయి.
అంతేకాదు ద్వి చక్ర వాహనాలు, ఫోర్ వీలర్స్ అన్ని పాడై పోయాయి. ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు పనికి రాకుండా పోయాయి. మొత్తంగా కట్టు బట్టలతో వరద ప్రభావిత ప్రాంత ప్రజుల రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం కూడా పై పైనే చేసినట్టు కనిపించినా.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు సహాయాలు అందలేదు. కేంద్రానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగితే కానీ పరిస్థితులు కుదట పడలేదు.
ముఖ్యంగా మున్నేరు వరద సృష్టించిన విలయం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కోలుకోక ముందే మరో షాకింగ్ వార్త అక్కడ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోందన్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ముంపు బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించింది. మళ్లీ మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.