Governor Tamilisai Soundararajan sensational comments on Telangana CM KCR: సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రుల్లో కొందరు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తో పనిచేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. పది రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్రానికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.
తాను ఇద్దరు ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నానని చెప్పారు గవర్నర్ తమిళిసై. వ్యక్తిత్వంలో ఇద్దరూ భిన్నమైనవారని అన్నారు. అయితే తన సుదీర్ఘ ప్రజా జీవితంలో కేసీఆర్ లాంటి వాళ్లను చూడలేదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. గవర్నర్ స్థాయిలో ఉన్న తనపైనే టీఆర్ఎస్ నేతలు పాత వీడియోలను వాడుకొని ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తోందన్నారు. కావాలని ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని గవర్నర్ చెప్పారు.
రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకుంటున్నా కావాలని తనని దూరం పెడుతున్నారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం మసులుకుంటున్నా టీఆర్ఎస్ నేతలకు కష్టం అయితే తాను ఏమీ చేయలేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ను సొంత సోదరుడిగా భావించినా.. అవమానాలు తప్పడం లేదని అన్నారు. ప్రగతిభవన్, రాజ్ భవన్ కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తెలంగాణ గవర్నర్ తప్పుపట్టారు.
గత కొంతకాలంగా తెలంగాణ సీఎం గవర్నర్ తమిళిసై పై అసంతృప్తిగా ఉన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సైతం గవర్నర్ ప్రసంగం లేకుండా జరిపించారు. మొన్నటి మేడారం జాతర నుంచి నిన్నటి భద్రాచలం పర్యటన వరకు గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ఇవ్వకుండా అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు కూడా గవర్నర్ తీరును తప్పుపడుతూ బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. గవర్నర్ బంగ్లా రాష్ట్ర బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్..తెలంగాణ బీజేపీ నేతలకు ఎందుకు పరోక్షంగా సహకరిస్తోందని తప్పుపట్టారు.
Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్
Also Read: Honey Facial Benefits: తేనె వినియోగంతో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook