Harish Rao Challenge to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రేవంత్‌ది తొండి రాజకీయం అని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. 'రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?' అని అడిగారు. ఈ విషయాలపై ఎల్లుండి తాను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తానని.. చర్చకు సీఎం రేవంత్ కూడా రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన 8 ప్రధాన హామీలను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని.. ఆగస్టు 14 అర్థరాత్రి వరకు గడువు ఇస్తానన్నారు.
Also Read: Varalaxmi: ఇక చాలు ఆపండి.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్
"రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. ఇంకా చేయలేదు. కనీసం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తయారు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్ పెడుతున్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేయనందుకు ముందు రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పాలి. జరిగిన జాప్యానికి బాధ్యత వహించాలి. తాజాగా ఇచ్చిన హామీ ప్రకారమైనా ఆగస్టు 15లోపు వందకు వంద శాతం రుణమాఫీ చేయాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి 4 నెలలు గడిచి పోయాయి. ఒక్కో మహిళలకు మీరు ఇప్పటికే రూ.10 వేలు బాకీ ఉన్నారు. ఎప్పుడు ఈ బాకీ తీరుస్తారు..? నెల నెలా ఎప్పటి నుంచి ఖాతాలో వేస్తారు..?
కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. గడిచిన 4 నెలల్లో వేల సంఖ్యలో పెళ్లిల్లు జరిగాయి. వారికి బంగారం ఎప్పుడు ఇస్తారు..? రైతుభరోసా కింద ఎకరానికి 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రబీ సీజన్‌లో రైతుబంధుకు పెంచిన సాయం అందిస్తామన్నారు. కానీ మేమిచ్చిన రైతుబంధు పథకం డబ్బులే ఇంకా అందరీ అందలేదు. గడిచిన రబీ సీజన్‌కు ఎకరానికి 5,000 బకాయి పడ్డారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌లో జూన్ నుంచి మీరు ఎకరానికి 15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారు..? ఎంత ఇస్తారు..?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతీ పంటకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. రబీ సీజన్ నుంచే ఇస్తామని చెప్పారు. కానీ రబీ సీజన్‌లో ఒక్క క్వింటాకు కూడా బోనస్ ఇవ్వలేదు. ఇందుకు బాధ్యత ఎవరిది.. వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పగా.. నాలుగు నెలలు దాటి ఐదో నెల గడుస్తున్నా ఇవ్వలేదు. చేయూత పథకం కింద పెన్షన్‌ను రూ.2 వేల నుంచి 4 వేలకు పెంచుతామన్నారు. కానీ నేటికీ పెంచిన పెన్షన్ రావడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఎవరికీ ఇవ్వలేదు.." అని హరీష్ రావు ప్రశ్నించారు.
Also Read: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి