Ex Minister KTR: నాలుగు గోడల మధ్య కాదు.. 4 కోట్ల మంది ముందు పెడదాం.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 18, 2024, 04:10 PM IST
Ex Minister KTR: నాలుగు గోడల మధ్య కాదు.. 4 కోట్ల మంది ముందు పెడదాం.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR Vs CM Revanth Reddy: దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో త్వరలోనే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ విషయం మీద ఈ వారం క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయన్నారు. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా.. రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు.

Also Read: Spy Camera: మహిళా టీచర్ల బాత్రూమ్‌లో రహాస్య కెమెరా.. స్కూల్‌ డైరెక్టర్‌ నీచపు పని

"తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా.. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. 

ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పాను. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి." అని కేటీఆర్ అన్నారు. మరోవైపు కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మాజీ మంత్రి హరీష్‌ రావు కలవనున్నారు. ఈ కార్ రేసు అంశంపై అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరనున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే  చర్చను కోరుతూ స్పీకర్‌కు  బీఆర్ఎస్ శాసనసభాపక్షం వినతి పత్రం అందజేసింది.

Also Read: Viral Video: జగన్నాథుడి ముందు వంగి ప్రార్ధించిన కోడి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News