ECIL Recruitment 2020: మేనేజర్ పోస్టులకు ఈసీఐఎల్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు

ECIL Recruitment 2020: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ఖాళీలు భర్తీ చేయడంలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఎంపికైన వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Last Updated : Dec 11, 2020, 03:13 PM IST
  • ఈసీఐఎల్‌లో మేనేజర్ ఉద్యోగాలు
  • పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
  • డిసెంబర్ 31తో తుది గడువు
ECIL Recruitment 2020: మేనేజర్ పోస్టులకు ఈసీఐఎల్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు

ECIL Recruitment 2020: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ఖాళీలు భర్తీ చేయడంలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL)‌లో ఎంపికైన వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం 15 ఖాళీలున్నాయి. ఆయా ఉద్యోగాలు ఆధారంగా ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హెచ్ఆర్, లా, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, లేక సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఉత్తర్ణతతో పాటు తగిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో ఈసీఐఎల్ పేర్కొంది.
Also Read : Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 
దరఖాస్తులకు తుది గడువు: డిసెంబర్ 31, 2020.

Also Read : JEE Mains 2021 To Be Held Four Times: వచ్చే ఏడాది నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్

అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:
Additional General Manager &  In-Charge, HR
 IN-Charge, HR Personnel GROUP, Administative Office, Electronics Corporation Of India Limited, ECIL (POST), Hyderabad – 500062, Telangana

ఈసీఐఎల్ నోటిఫికేషన్:  ECIL Jobs 2020 Notification

అధికారిక వెబ్‌సైట్ - ECIL Official Website  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News