Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్

Digital survey on agricultural lands in Telangana: హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను (Pilot digital survey of agricultural lands) చేపట్టాలన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 3, 2021, 06:54 AM IST
Digital survey: తెలంగాణలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే లేటెస్ట్ అప్‌డేట్స్

Digital survey on agricultural lands in Telangana: హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. డిజిటల్ సర్వే కోసం రాష్ట్రంలో 27 గ్రామాలను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కి సూచించిన కేసీఆర్.. ఆ గ్రామాల జాబితాలో గజ్వేల్ నియోజకవర్గం నుంచి 3 గ్రామాలను ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాల నుంచి ఎంపిక చేయాలని ఆదేశించారు. డిజిటల్ సర్వేపై (Agricultural lands digital survey) చర్చించేందుకు బుధవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

డిజిటల్ సర్వే అంశంపై సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. '' రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల పరిరక్షణ కోసమే ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే భవిష్యత్తులో భూ తగాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ డిజిటల్ సర్వే చేపట్టేందుకు సిద్ధమైంది'' అని అన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ, రేఖాంశాలను (Fixing coordinates) గుర్తించడం ద్వారా పట్టాదారుల భూములకు (Patta lands) శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. 

Also read : Rythu Bandhu scheme June 2021 installment: రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

పైలట్ డిజిటల్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు, ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా పైలట్ సర్వే (Pilot digital survey villages) నిర్వహించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత పూర్తి స్తాయి సర్వేలో ఆ ఇబ్బందులను అధిగమించేలా విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. 

డిజిటల్ సర్వేలో తొలుత వ్యవసాయ భూముల సర్వే పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే (Urban lands digital survey) చేపట్టే అవకాశమున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గ్రామాల్లో ఎలాంటి భూ తగాదాలు లేకుండా ధరణి పోర్టల్ (Dharani portal) ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు చక్కదిద్దిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. 

Also read: Etela Rajender: ఈటల రాజేందర్ చేరికపై BJP MLA Raja Singh ఆసక్తికర వ్యాఖ్యలు 

డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రాకుండా, మళ్లీ భవిష్యుత్తులో ఎలాంటి భూతగాదాలు (Land disputes) లేకుండా స్పష్టమైన కొలతలు వచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ డిజిటల్ సర్వే చేపట్టాలని వారికి సూచించారు. డిజిటల్ సర్వేలో నిర్లక్యంగా వ్యవహరించి తప్పులకు తావిచ్చినట్లయితే.. సదరు సంస్థపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ సర్కారు వెనకాడబోదని సీఎం కేసీఆర్ (CM KCR) ఈ సమీక్షలో పాల్గొన్న సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. 

ఈ సమీక్షలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి (Rythu Bandhu samiti chairman Palla Rajeshwar Reddy), ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శాసన సభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్,  ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు, వి.శేషాద్రి, భూపాల్ రెడ్డి, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డిజిపి మహేందర్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్ కో సిఎండీ ప్రభాకర్ రావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ శశిధర్, టిఎస్ టిఎస్ ఎండీ జి.టి. వెంకటేశ్వర్ రావు, డిజిటల్ సర్వే సంస్థల (Digital survey agencies) ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also read: Telangana: తెలంగాణలో తగ్గినట్టు కనిపిస్తున్న కరోనావైరస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News